BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు 49వ డివిజన్ ముస్లిం మైనార్టీ నాయకుల మద్దతు

Select Suryaa Now
వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు 49వ డివిజన్ ముస్లిం మైనార్టీ నాయకుల మద్దతు

అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న సి. రమేష్ గౌడ్‌కు 49వ డివిజన్‌కు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్‌ను ఆప్యాయంగా పలకరిస్తూ.. “బేటా.. మా ఓటు నీకే వేస్తాం” అంటూ తమ మద్దతును వ్యక్తం చేశారు.

49వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆరిఫా నేతృత్వంలో ముస్లిం మైనార్టీ నాయకులు రమేష్ గౌడ్‌ను కలిసి ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ డివిజన్ ప్రజలను వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ, మేయర్‌గా ఎన్నికైతే నగర ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ నగర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, అన్ని వర్గాల ప్రజలకు సేవలందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే, కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి మోసపోవద్దని ముస్లిం మైనార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఏకేఎస్ ఫయాజ్, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ కాగజ్‌గర్ రిజ్వాన్, కలందర్, శమ్ము, మాభాష, షౌకత్, గౌస్ తదితర ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

రమేష్ గౌడ్ నాయకత్వంపై తమకు నమ్మకం ఉందని, ఆయన నగర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొని అభ్యర్థికి తమ సంఘీభావాన్ని తెలిపారు.