BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా సబ్బితి చిన్నమ్మ నామినేషన్ ప్రజా సంక్షేమమే లక్ష్యం.. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా

Select Suryaa Now
వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా సబ్బితి చిన్నమ్మ నామినేషన్  ప్రజా సంక్షేమమే లక్ష్యం.. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా

భీమవరం, సూర్య న్యూస్: తాడేపల్లిగూడెం నియోజకవర్గ జడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున సబ్బితి చిన్నమ్మ బుధవారం భీమవరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీకి ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో పాటు తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి వడ్డి రఘురాం సహకారంతో జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి సబ్బితి చిన్నమ్మ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సామాన్య ప్రజల సంక్షేమం, పేదల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిందన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని తెలిపారు.

జడ్పీటీసీగా అవకాశం లభిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సబ్బితి చిన్నమ్మ స్పష్టం చేశారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, వారి సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని ఆమె వెల్లడించారు.