ఘనంగా మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు
శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను బుధవారం రోజున శంకరపల్లి నాయకులు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ శ్వేతా పాండురంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాశట్టి చంద్రమోహన్, మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు చంద్రమౌళి మరియు కౌన్సిలర్లు అందరూ కలిసి స్థానిక చివర స్థలం కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు అందజేశారు. మున్సిపల్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రవీణ్ కుమార్ రాబోయే కాలంలో మరిన్ని పదవులు చేపట్టి, ఆయురారోగ్యాలతో నిత్యం ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు.
మహారాజ్పేట్ జై ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ
మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కౌన్సిలర్లు అశోక్ కుమార్, సమియోద్దీన్ ఆధ్వర్యంలో మరాజ్పేటలోని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధులకు వస్త్రాలు మరియు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం పార్టీలకతీతంగా అందరూ నాయకులను కలుపుకొని శంకరపల్లి మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రవీణ్ కుమార్ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాబోయే కాలంలో మరిన్ని పదవులు పొంది, యంత్రం ప్రజలకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, మోకిలా చైర్మన్ సత్యం, కౌన్సిలర్లు ఆనంద్, గిరిజా శేఖర్, ప్రశాంత్, అఖిల యాదిరెడ్డి, లలిత మోహన్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు రజిని శ్రీనివాస్, మహమూద్, నాయకులు లచ్చిరెడ్డి, పొడవు శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాడిశెట్టి రాజశేఖర్, మేజర్ న్యూస్ : శంకర్పల్లి