BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు మాలోత్ భోజ్య నాయక్

Select Suryaa Now
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు మాలోత్ భోజ్య నాయక్

సూర్య,అశ్వారావుపేట: అశ్వారావుపేట నియోజకవర్గానికి బుధవారం విచ్చేసిన ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలోత్ భోజ్య నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు.

స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన అశ్వారావుపేటలోని శ్రీశ్రీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్సీ ఇన్‌చార్జి ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భోజ్య నాయక్ వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం భోజ్య నాయక్ మాట్లాడుతూ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలని, ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.

విద్యావంతుల సమస్యలను అర్థం చేసుకొని, వారి హక్కుల సాధనకు కృషి చేసే నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని అన్నారు.

ఈ సమావేశం ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి, పట్టభద్రులను చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి బాటలు వేయాలని నాయకులు నిర్ణయించారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట