BREAKING
నాగలక్ష్మీ దేవాలయంలో ప్రత్యేక పూజలు.. అన్నదాన కార్యక్రమం మార్కో జాన్సెన్ ఆల్‌రౌండ్ వీరవిహారం: 60 ఏళ్ల రికార్డు బ్రేక్, ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జోరు! విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ అమరుల త్యాగాలు పోలీసులకు స్ఫూర్తి: సైబరాబాద్ సీపీ డా. యం. రమేష్ బిజెవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కసిరెడ్డి సింధూరెడ్డి నియామకం గరివిడి లక్ష్మి చిత్రంలో సత్తిబాబుగా రాగ్ మయూర్ అద్భుత నటన: టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన మేకోవర్! 32వ డివిజన్ కూటమి అభ్యర్థిగా కౌసర్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు కూటమి అభ్యర్థి ఉమామహేశ్వరి విజయానికి కరాటం రాంబాబు, శేషు ప్రచారం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు శేరిలింగంపల్లిలో రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో.... ఘనంగా శమీ పూజ, రావణ దహనం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో రమణ 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు: 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్ పాతబస్తీలో బతుకమ్మ నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు లేక మహిళలకు ఇబ్బందులు పోలీసులు ఫ్లాగ్ మార్చ్

ముమ్మరప్రచారంలో డాక్టర్ షకీలా

Select Suryaa Now
ముమ్మరప్రచారంలో డాక్టర్ షకీలా

ముమ్మర ప్రచారంలో డాక్టర్ షకీలా 
--అడుగడుగునా జననీరాజనం 
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య :
ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న బి ఎస్ ఆర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల తెలుగుదేశం అభ్యర్థులు,తెలుగుదేశం నాయకులతో కలిసి ఆమె ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి ఓట్లు వేసి విజయం చేకూర్చాలని ఆత్మకూరు అభివృద్ధికి సహకరించాలని కోరారు. మూడు ద పాలు శాసనసభ్యులుగా ఉన్న డాక్టర్ బొమ్మిరెడ్డి సుందర్ రామిరెడ్డి కోడలు, మండల అధ్యక్షుడుగా సర్పంచ్ గా వ్యవహరించిన డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సతీమణి, యువ నేత బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి తల్లి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులతో కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్థినిగా చైర్పర్సన్ గా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆత్మకూరు మున్సిపాలిటీ అనూహ్యంగా అభివృద్ధి పరుస్తున్న అభివృద్ధి ప్రదాత ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో తాను మున్సిపల్ చైర్ పర్సన్ గా పోటీ చేస్తున్నానని, అందరూ ఆదరించి ఆశీర్వదించి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. ఇంటింటికి వెళ్లి ఆమె అందర్నీ కలిసి అభ్యర్థించారు. ఆమె బుధవారం పలు వార్డుల్లో పర్యటించగా జనాలు పూల వర్షం కురిపిస్తూ సన్మానాలు చేస్తూ అఖండ నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళ నాయకురాలు పులిమి శైలజా రెడ్డి ఆయా అవార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు.ఆత్మకూరు పట్టణానికి తమ మామ డాక్టర్ సుందర రామిరెడ్డి,తన భర్త డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి అందించిన సేవలను, తాను అందిస్తున్న వైద్య సేవలతో పాటు సామాజిక సేవలను, తన కుమారుడు తారక్ నాథ్ రెడ్డి అందిస్తున్న బి ఎస్ ఆర్ ట్రస్ట్ సామాజిక సేవలను, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఆమె ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు.