స్థానిక ఎన్నికలపై మంత్రి 'గొట్టిపాటి' సమీక్ష
నరసాపురం, మేజర్ న్యూస్ : స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారంనిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ , రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ , టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు , కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు , డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు.
రాబోయే మున్సిపల్, సర్పంచ్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఘనవిజయమే లక్ష్యంగా అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహాలు, ప్రచార కార్యాచరణపై సుదీర్ఘంగా సమీక్షించారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలని నిర్ణయించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పూర్తి సమన్వయంతో పనిచేసిమున్సిపల్ చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్లతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల అఖండ విజయానికి సమిష్టిగా కృషి చేయాలని ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.