BREAKING
19 ఎంపీటీసీ స్థానాలకు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ.. వైభవంగా దుర్గ మాత ఊరేగింపు ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా ఎన్నికల పరిశీలకుడు కన్నబాబు అభ్యర్థులకు తెలియకుండానే ఇద్దరు వైసిపి నామినేషన్ల ఉపసంహరణ రెండు రోజులుగా తాగునీటి కరువు! ట్యాంకర్ల ద్వారా కూడా నీరు సరఫరా చేయలేని పరిస్థితి.. ప్రజల ఇబ్బందులు పట్టించుకునేదెవరు? ఏ. నారాయణపురము 2 ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థి కే లాలు స్వామి నామినేషన్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు – ఏఎస్పీ సౌజన్య కోనంకి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా జొన్నలగడ్డ రేణుకాదేవి తొలి నామినేషన్ బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు  ఆస్కార్ రేసులో నిలిచిన కొరియన్ మూవీ పాసిబుల్ లవ్ ఫైనల్ ట్రైలర్ రిలీజ్ మామదాపూర్‌లో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాల ముగింపు పాలకోడేరు జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా చింతలపాటి శివ నాగరాజు నామినేషన్ టీడీపీలో సుదీర్ఘకాలంగా అందించిన సేవలకు గుర్తింపుగా అవకాశం అశ్వారావుపేట మండలంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం — పోలీసుల దర్యాప్తు కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ నామినేషన్లను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంపై దాడే! డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం

గీతా మందిరం వద్ద అఖండ అన్నసమారాధన వెయ్యి మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ

Select Suryaa Now
గీతా మందిరం వద్ద  అఖండ అన్నసమారాధన  వెయ్యి మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ

టి.నరసాపురం, సూర్య న్యూస్: గీతా మందిరం వద్ద నిర్వహించిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా బుధవారం ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అఖండ అన్నసమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టి.నరసాపురం సబ్‌ ఇన్‌స్పెక్టర్ జయబాబు దంపతులు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం నుంచే ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ అన్నసమారాధనలో వెయ్యి మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ జయబాబు మాట్లాడుతూ, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన ఆలయాల ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. పండుగల సమయంలో భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఎస్‌ఐ దంపతులకు సన్మానంఅనంతరం గీతా మందిరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎస్‌ఐ జయబాబు, ఆయన సతీమణి జ్యోతి దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అన్నసమారాధన కార్యక్రమం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.

 క్రైమ్ రిపోర్టర్: అద్దంకి గిరి కుమార్ ఏలూరు జిల్లా