BREAKING
ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా ఎన్నికల పరిశీలకుడు కన్నబాబు అభ్యర్థులకు తెలియకుండానే ఇద్దరు వైసిపి నామినేషన్ల ఉపసంహరణ రెండు రోజులుగా తాగునీటి కరువు! ట్యాంకర్ల ద్వారా కూడా నీరు సరఫరా చేయలేని పరిస్థితి.. ప్రజల ఇబ్బందులు పట్టించుకునేదెవరు? ఏ. నారాయణపురము 2 ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థి కే లాలు స్వామి నామినేషన్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు – ఏఎస్పీ సౌజన్య కోనంకి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా జొన్నలగడ్డ రేణుకాదేవి తొలి నామినేషన్ బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు  ఆస్కార్ రేసులో నిలిచిన కొరియన్ మూవీ పాసిబుల్ లవ్ ఫైనల్ ట్రైలర్ రిలీజ్ మామదాపూర్‌లో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాల ముగింపు పాలకోడేరు జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా చింతలపాటి శివ నాగరాజు నామినేషన్ టీడీపీలో సుదీర్ఘకాలంగా అందించిన సేవలకు గుర్తింపుగా అవకాశం అశ్వారావుపేట మండలంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం — పోలీసుల దర్యాప్తు కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ నామినేషన్లను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంపై దాడే! డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం యద్దనపూడిలో ఎంపీటీసీ నామినేషన్ల సందడి మొత్తం ఆరు నామినేషన్లు దాఖలు ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌ను కలిసి దసరా శుభాకాంక్షలు

మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు

Select Suryaa Now
మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు

ఏపీ సూర్య స్టేట్ బ్యూరో,అమరావతి :  ;మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన వైసీపీ సీనియర్ నేత, గుంటూరు పార్లమెంట్ వైసీపీ ఉపాధ్యక్షుడు, దుగ్గిరాల మాజీ ఎంపీపీ వడ్డేశ్వరపు రజనీకాంత్ నియోజకవర్గ శాసనసభ్యులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనతో పాటు 25 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి లోకేష్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

*అభివృద్ధిని బేరీజు వేసుకుని కూటమి అభ్యర్థులను గెలిపించాలి* ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మనందరం ఒక కుటుంబం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పద్ధతి ప్రకారం నెరవేరుస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ, ఆసుపత్రి నిర్మాణంతో పాటు కమ్యూనిటీ భవనాలు, పార్క్ లు, అంగన్ వాడీ భవనాలు, లైబ్రరీలు, స్మశానాలు అభివృద్ధి చేస్తున్నాం. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి చేస్తున్నాం. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 2024 ఎన్నికల కంటే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ రావాలి. కూటమి అభ్యర్థులను గెలిపించాలి. అందరం ఎన్డీయే పక్షాన నిలబడాలి. అదే మనకు శ్రీరామరక్ష. అప్పుడే మనం అనుకున్న అభివృద్ధి సాధ్యం. ఇందుకు మీ అందరి సహకారం కావాలి. శాంతియుత వాతావరణంలో స్థానిక ఎన్నికలకు వెళ్దాం. కలిసికట్టుగా పనిచేద్దాం. గతంలో పదేళ్లు ఒకరికి అవకాశం ఇచ్చారు.

 రెండున్నరేళ్లు నాకు ఇచ్చారు. అప్పటికీ, ఇప్పటికీ జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి. మీకు అందుబాటులో ఉండి అహర్నిశలు పనిచేస్తానని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో చిలువూరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోటకూర సీతారామయ్య, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ యాళ్ల జయలక్ష్మీ, టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్ చిలువూరి ఏసుపాదం, దుగ్గిరాల మండల టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పినపాటి కరుణాకర్, యూనిట్ ఇంఛార్జ్ చిలువూరి శేషగిరి తదితరులు పాల్గొన్నారు.