BREAKING
నార్లాపూర్‌లో అభివృద్ధి పనులు శరవేగం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పేదలకు సీఎం సహాయనిధి అండ. రొంపిచర్లలో గొడవలకు దిగితే కఠిన చర్యలు! ఏఎస్పీ హనుమంతరావు *సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక* ప్రచారంలో దూసుకుపోతున్న 25వ కౌన్సిలర్ అభ్యర్థి పంతగాని ప్రేమలత మాబుసుభాని గ్యార్మీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి మ‌ల్లారెడ్డిపేటలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌లు మల్కాపూర్‌లో ఘనంగా స్వేరోస్ డే వేడుకలు పేటేరు గ్రామంలో పొలంబడి కార్యక్రమం పేదల ఆకలి తీర్చిన పోరాటయోధుడు పండుగ సాయన్న బాబా పిలుపుతో పుస్తకావిష్కరణ ఒక్క ఓటు మిస్ కావద్దు... మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు *అల్లం పంటలో కొత్త తెగులు.. కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన!* వెంకటాపూర్ గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

రాజకీయ అనుభవమే బలం

Select Suryaa Now
రాజకీయ అనుభవమే బలం

భోగాపురం, అక్టోబర్ 21, (మేజర్ న్యూస్) : రాజకీయ అనుభవం, కుటుంబ నేపథ్యం, ప్రజాప్రతినిధిగా గతంలో పనిచేసిన అనుభవంతో నీలాపు సూర్యలక్ష్మి మరోసారి ఎంపీటీసీ ఎన్నికల బరిలోకి దిగారు. చేపలకంచేరు ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం. రామారావుకు పత్రాలు సమర్పించారు. ఎంబీఏ విద్యార్హత కలిగిన సూర్యలక్ష్మి 2014–2019 మధ్య ఎంపీటీసీగా పనిచేసి తన రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారు. ఈమె భర్త నీలాపు అప్పలరామిరెడ్డి(ఎస్పిఎల్) తెదేపా విజయనగరం పార్లమెంట్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.  సూర్యలక్ష్మి తల్లి శీరపు సూరమ్మ సైతం 2009–2014 మధ్య రెడ్డికంచేరు సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు. ఇలా కుటుంబంలోనే ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనుభవం ఉండటంతో నీలాపు కుటుంబానికి స్థానిక రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో ఎంపీటీసీగా పనిచేసిన అనుభవాన్ని, కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని బలంగా మలుచుకుంటూ ఈసారి చేపలకంచేరు నుంచి మరోసారి విజయం సాధించాలని సూర్యలక్ష్మి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అత్యధిక మెజారిటీతో గెలుపొందడమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమెకు కుటుంబ రాజకీయ అనుభవం ఎంతవరకు కలిసివస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

రిపోర్టర్ : వై శ్రీనివాస రావు, భోగాపురం, విజయనగరం జిల్లా.