BREAKING
ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా ‘అలయ్ బలయ్’: బండారు దత్తాత్రేయను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు! వైయస్సార్ పార్టీ నాయకులు అరాచకం మూల్యం తప్పదు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాయం ప్రముఖ్ టౌన్ షిప్ లో వైభవంగా దుర్గామాత శోభయాత్ర హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా సన్నాహక సమావేశం ఎమ్మెల్యే మర్రి, నందికంటి శ్రీధర్ లకు దసరా శుభాకాంక్షలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడను : మాజీ కార్పొరేటర్ శ్రవణ్ జలమండలిలో ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు *గుండారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ధర్నా అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్* విప్లవ వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన హెచ్‌ఎండీఏ కొమురం భీం.. పండుగ సాయన్న పోరాట స్ఫూర్తి! బహుజన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం జలమండలి ఎండీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన టీజీవో ప్రతినిధులు *నూతన వధూవరులను ఆశీర్వదించిన గవ్వ వంశీధర్ రెడ్డి* అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం ట్రాక్టర్ సీజ్… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సమష్టి కృషి చేయాలి...

ఒక్క ఓటు మిస్ కావద్దు... మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

Select Suryaa Now
ఒక్క ఓటు మిస్ కావద్దు... మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

మణుగూరు ఆర్ సి సూర్య ; జిల్లాలోని పాఠశాలలు తిరిగి పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో, అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధులకు తప్పనిసరిగా హాజరయ్యే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపునిచ్చారు.
గ్రామీణ ప్రాంతాల్లోని మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ పరిధిలో ఉన్న అన్ని ప్రాథమిక పాఠశాలలను సందర్శించి, ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం ఇప్పటికే ఓటు నమోదు చేసుకున్నారా లేదా అనేది తెలుసుకోవాలన్నారు. నమోదు చేసుకోని అర్హులైన ఉపాధ్యాయులకు ఫారం-18 అందించి, ఓటరు నమోదుకు అవసరమైన వివరాలను తెలియజేయాలన్నారు
అదేవిధంగా, స్థానిక మండల నాయకులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, సహకారసంఘాల అధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్స్ ఇతర ముఖ్య నాయకులు సమన్వయం చేసుకొని తమ మండల పరిధిలోని జిల్లా పరిషత్ / ఆశ్రమ /ప్రయివేట్ / గురుకుల / కస్తూరిబా గాంధీ / ఏకలవ్య ఉన్నత పాఠశాలలను సందర్శించి, అర్హులైన ఉపాధ్యాయులకు ఫారం-18 అందజేసి ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు..
పూర్తి చేసిన ఫారం-18తో పాటు ఓటరు నమోదుకు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలను జతచేసి అక్టోబర్ 24 న మనకు తిరిగి అందజేయాలని ఉపాధ్యాయులకు ముందుగానే తెలియజేయాలని అన్నారు.మన పార్టీ నాయకులు మళ్ళీ తిరిగి కలెక్ట్ చేసుకొని ఓటరుగా నమోదు చేపించాలి.
ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జిలు /నియోజకవర్గ సభ్యత్వ నమోదు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిలు బాధ్యతగా తీసుకొని, అర్హులైన గ్రాడ్యుయేట్లు ఎవరూ ఓటు హక్కును కోల్పోకుండా సమన్వయంతో పనిచేయాలి. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఈ ఓటరు నమోదు ప్రక్రియ ఎంతో కీలకం కావున, పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

పొనగంటి కృష్ణ  మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా