telangana
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
సూర్య కరీంనగర్ ;పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా స్థానిక శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.సమాజ రక్షణ కోసం, శాంతిభద్రతల పరిరక్షణలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నారు.అలాగే పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది క్షేమం, ప్రజా సంక్షేమం కోరుతూ ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ విశేష పూజలు, అర్చనలు జరిపించారు.ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ — సమాజ శాంతి కోసం అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.