అభివృద్ధిని చూసి...ఆదరించండి : ఎమ్మెల్యే కన్నా
సత్తెనపల్లి, మేజర్ న్యూస్ :
గత 26 నెలల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి,స్థానిక ఎన్నికలకు మీ ముందుకు వచ్చామని అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం
పట్టణంలోని 21, 24వ వార్డు లలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ వార్డు కార్యాలయాలను ఆయన పల్నాడు జిల్లా తెదేపా ఉపాధ్యక్షులు దరువూరి నాగేశ్వరరావు,మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మారెళ్ళ రామాంజనేయులతో కలిసి ప్రారంభించారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "చెప్పాం - చేస్తున్నాం" ప్రచార కార్యక్రమంలో భాగంగా పలు వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో కూటమి అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
గన్నవరం ఏలియ , సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి