BREAKING
ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా ‘అలయ్ బలయ్’: బండారు దత్తాత్రేయను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు! వైయస్సార్ పార్టీ నాయకులు అరాచకం మూల్యం తప్పదు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాయం ప్రముఖ్ టౌన్ షిప్ లో వైభవంగా దుర్గామాత శోభయాత్ర హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా సన్నాహక సమావేశం ఎమ్మెల్యే మర్రి, నందికంటి శ్రీధర్ లకు దసరా శుభాకాంక్షలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడను : మాజీ కార్పొరేటర్ శ్రవణ్ జలమండలిలో ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు *గుండారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ధర్నా అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్* విప్లవ వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన హెచ్‌ఎండీఏ కొమురం భీం.. పండుగ సాయన్న పోరాట స్ఫూర్తి! బహుజన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం జలమండలి ఎండీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన టీజీవో ప్రతినిధులు *నూతన వధూవరులను ఆశీర్వదించిన గవ్వ వంశీధర్ రెడ్డి* అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం ట్రాక్టర్ సీజ్… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సమష్టి కృషి చేయాలి...

*సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక*

Select Suryaa Now
*సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక*

సంగారెడ్డి;సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ సంఘం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సెంట్రల్ యూనియన్ మహిళా ఉపధ్యక్షురాలు  శ్రీమతి నిర్మల రాజకుమారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించగా, నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.ఈ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ నూతన *జిల్లా అధ్యక్షులుగా మహమ్మద్ జావిద్ అలీ,* జిల్లా కార్యదర్శిగా *వేల్పూరు* *రవి,* అసోసియేట్  అధ్యక్షులుగా *వెంకట్ రెడ్డి, శ్రీనివాస్,* కోశాధికారిగా *కసిని శ్రీకాంత్,* లీగల్ అడ్వైజర్‌గా *భాస్కర్,* ఉపాధ్యక్షులుగా కృష్ణ, నాగేశ్వరరావు శ్రీకాంత్, విజయలక్ష్మి జాయింట్ సెక్రెటరీలుగా షకీల్, నరసింహారెడ్డి, మోహనప్ప, సుధామణి ఆఫీస్ సెక్రటరీగా   సాయికుమార్ స్పోర్ట్స్ సెక్రటరీగా  వెంకటేషం - రవికుమార్, మాణిక్యం ఈసీ మెంబర్లుగా విజయ్ కుమార్, మురళీధర్, లక్ష్మి, పుష్పలత, బషీర్, సురేఖ, వినయ్, బాలామణి, శ్యాంసుందర్  ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ అలీ మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగుల ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ, సంఘాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు.జిల్లా కార్యదర్శి వేల్పూరు రవి మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంఘం తరఫున నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం సంఘం నాయకులు, సభ్యుల సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు.నూతన కార్యవర్గం ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. ఏకగ్రీవ ఎన్నిక ద్వారా సంఘం నాయకత్వంపై ఉద్యోగులు ఉంచిన విశ్వాసం స్పష్టమైందని పేర్కొన్నారు.సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ, ఉద్యోగుల సమస్యల   పరిష్కారంలో ముందుండి  నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బలరాం, జగన్ పట్టణ బాధ్యులు ప్రమోద్ కుమార్, యాదవ్ రెడ్డి, వెంకట్, మిస్కిన్, దత్తు, నర్సింలు, దుర్గయ్య పాల్గొన్నారు