మల్కాపూర్‌లో ఘనంగా స్వేరోస్ డే వేడుకలు
కొండాపూర్;ఎస్‌ఆర్ శంకరన్ జయంతిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో అంబేద్కర్ విగ్రహం ఎదుట స్వేరోస్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. విద్య, సామాజిక చైతన్యం, సమాన హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్వేరోస్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా స్వేరోస్ అధ్యక్షుడు బీబీపేట్ రాజు, ప్రధాన కార్యదర్శి నల్లవల్లి పల్లవి, పి. శిరీష గౌడ్, మీడియా కన్వీనర్ పల్గటి శ్యాం ప్రసాద్, సాక్షిత, రిషిత, విద్యాభారతి, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.