మాబుసుభాని గ్యార్మీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి
కళ్యాణదుర్గం ఇన్చార్జ్, (కళ్యాణదుర్గం ఇంచార్జ్ మేజర్ న్యూస్) : పట్టణంలో ముస్లిం సోదరులు సంప్రదాయబద్ధంగా నిర్వహించే మాబుసుభాని గ్యార్మీ వేడుకల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి తిమ్మరాజు పాల్గొన్నారు. ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు అనంతపురం రోడ్డులోని జెండా కట్ట వద్ద జరిగిన ఈ వేడుకల్లో వారు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
టీడీపీ నాయకుడు, సప్లయర్స్ దాదా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, బుట్నా లక్ష్మి ముస్లిం సోదరులతో ఆప్యాయంగా మమేకమయ్యారు. ప్రార్థనల అనంతరం వేడుకల్లో పాల్గొన్న వారికి స్వయంగా భోజనం వడ్డించి, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన ముస్లిం సోదరులతో వారు స్నేహపూర్వకంగా మాట్లాడారు. మత సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావం ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం కొనసాగింది. సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఇటువంటి వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
మాబుసుభాని గ్యార్మీ వేడుకల సందర్భంగా భక్తులు, స్థానికులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.
రిపోర్టర్ : సుధా మోహన్, కళ్యాణదుర్గం ఇన్చార్జ్, కళ్యాణదుర్గం.