బ్రహ్మదేవి ఎంపీటీసీ బిట్-1 వైకాపా అభ్యర్థి.... కట్టా
ముత్తుకూరు, మేజర్ న్యూస్ : బ్రహ్మదేవి ఎంపిటిసి స్థానం బిట్-1 అభ్యర్థిగా మాజీ సర్పంచ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్టా సుబ్రహ్మణ్యం బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమేష్ బాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. రాష్ట్ర మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో నామినేషన్ వేసినట్లు అభ్యర్థి పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు