BREAKING
ముక్కామల కూటమి ఎంపీటీసీ నామినేషన్లకు భారీ ర్యాలీ పెరవలి మండలంలో ఊపందుకున్న ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ దివంగత నటి సౌందర్యతో అనుబంధాన్ని తలచుకుని భావోద్వేగానికి గురైన సీనియర్ హీరోయిన్ ప్రేమ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కార్మిక నాయకుడు రెడ్డి అప్పలనాయుడు కి ప్రజా సంఘాల మద్దతు కడియంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం. డీఎస్పీ పర్యవేక్షణలో పటిష్ట పోలీసు బందోబస్తు నామినేషన్ల సందర్భంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదు కడియం ఎంపీపీ అభ్యర్థిగా రాజరాజేశ్వరి జక్కంపూడి రాజా సహా పార్టీ నేతల సంప్రదింపుల అనంతరం నిర్ణయం మెగా హీరోకు లైవ్‌లో ప్రపోజ్ చేసిన యాంకర్ శ్రీముఖి.. ఆయన ఇచ్చిన ఊహించని రిప్లై పి.గన్నవరం మండలంలో రెండో రోజు 33 నామినేషన్లు మల్లవరం పెదలంకలో దసరా నవరాత్రుల మహోత్సవాలు--మహిళల నృత్యాలతో అమ్మవారి ఊరేగింపు జిల్లాలో జడ్పీటీసీ అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ... కూతుళ్లతో కలిసి బిగ్‌బాస్ నటి చైత్ర రాయ్ దసరా వేడుకలు.. సామాజిక మాధ్యమాలలో ఫొటోలు వైరల్ అనపర్తిలో 28 నామినేషన్లు దాఖలు..ఇప్పటివరకు 49 నామినేషన్లు దాఖలు: కామవరపుకోటలో 49 నామినేషన్లు పిల్లల్లో విపరీతంగా పెరుగుతున్న చదువు ఒత్తిడి.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి

ఘనంగా పాటూరి రాజగోపాల్ నాయుడు 29వ వర్ధంతి

Select Suryaa Now
ఘనంగా పాటూరి రాజగోపాల్ నాయుడు 29వ వర్ధంతి

తిరుపతి:

ప్రజాసేవకు అంకితమైన నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ  పాటూరి రాజగోపాల్ నాయుడు 29వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాఘం గ్రామంలో స్మారక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అమర రాజా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు, మాజీ మంత్రి  గల్లా అరుణ కుమారి, అమర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా. గౌరీనేని రమాదేవి  రాజన్న మెమోరియల్ పార్క్‌లోని స్వర్గీయ రాజగోపాల్ నాయుడు  విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా గల్లా రామచంద్ర నాయుడు గారు మాట్లాడుతూ రాజగోపాల్ నాయుడు ప్రజలకు ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారు. ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఆయన ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని పేర్కొన్నారు.

గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ, రాజగోపాల్ నాయుడు ప్రజల మనిషిగా అందరి హృదయాల్లో నిలిచిపోయారు. ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం, సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధత ఎంతో గొప్పవి. ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవడం ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజన్న ఫౌండేషన్ హెడ్ రాళ్లపల్లి సతీష్, మాజీ సర్పంచులు కుమార్ నాయుడు, మహేష్ కుమార్, గోపి, పరంధామ నాయుడు, బంగారుపాళ్యం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ భాస్కర్ నాయుడు, మాజీ జెడ్పీటీసీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామస్థులు భజనలు, కోలాట ప్రదర్శనలు నిర్వహించి స్వర్గీయ రాజగోపాల్ నాయుడుకి నివాళులర్పించారు. గ్రామస్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన ప్రజాసేవలను స్మరించుకున్నారు.