BREAKING
తన చిన్ననాటి స్నేహితురాలితో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ పెళ్లి? టాలీవుడ్‌లో వైరల్ అవుతున్న వార్తలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ దసరా కానుకగా మున్సిపల్ చైర్మన్ కార్మికులకు దుస్తుల పంపిణీ పెడన మండల జడ్పిటిసి కూటమి ప్రభుత్వ అభ్యర్థిగా కాగితలక్ష్మి. ముండ్లమూరు మండల ఓటర్లు 45 605. నేడు గంగమ్మ ఆలయంలో బహిరంగ వేలం పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి రణబాలి 2 సినిమా ఉంటుందా దర్శకుడు ఏమన్నారంటే టాలీవుడ్‌లో వైరల్ అవుతున్న అప్‌డేట్ టిడిపి వల్లూరు ఎంపీటీసీ అభ్యర్థిగా సువ్వాడ వనజాక్షి నామినేషన్ దాఖలు దాడులు, బెదిరింపులకు భయపడం: కాకాణి రాజకీయ అనుభవమే బలం బలగం డైరెక్టర్ వేణు యల్దండికి ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందా టాలీవుడ్‌లో జోరుగా చర్చ ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ నమ్మకాన్ని నిరూపించిన అలిపిరి ఎస్సై ఉంగరం దొరక్క రష్మికకు ఆరోజు ప్రపోజ్ చేయలేదు విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

పోలింగ్ బూత్ ల నిర్వహణ తీరును పరిశీలించిన కమిషనర్

Select Suryaa Now
పోలింగ్ బూత్ ల నిర్వహణ తీరును  పరిశీలించిన కమిషనర్

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  :  అడిషనల్ ఎలక్షన్ అథారిటీ / కమిషనర్ వై.ఓ నందన్ సాధారణ ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్ల నిర్వహణలో భాగంగా వివిధ పోలింగ్ బూత్ ల నిర్వహణ తీరును అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. స్థానిక పొదలకూరు రోడ్డు ప్రాంతంలో తెలుగు గంగ కాలనీ, గాదంశెట్టి రోశయ్య నగర్, గాంధీ నగర్, వెంగళరావు నగర్, డి.కె.మహిళా కళాశాల, సర్వోదయ కళాశాల, పాలిటెక్నిక్ కాలేజ్, ఫతేఖాన్ పేట కొండాయపాలెం డొంక పాఠశాల, రామయ్య బడి, డి.ఎస్.ఆర్, వేద సంస్కృత పాఠశాల, ఈ.ఎస్.ఆర్.ఎమ్ పాఠశాల, ఇరుగాలమ్మ దేవస్థానం సమీపం, తదితర ప్రాంతాలలోని పోలింగ్ బూతులను కమిషనర్ తనిఖీ చేసి, ఓటింగ్ నిర్వహణకు అవసరమైన వసతులను పరిశీలించారు. మెరుగైన పారిశుధ్య నిర్వహణ చేపట్టి ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు. కొన్ని ప్రాంతాలలో స్థానికులతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వెంగళరావు నగర్ తాతయ్య బడి ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ పనులను కమిషనర్ పర్యవేక్షించి, వాతావరణానికి అనుకూలంగా రైన్ కోట్లు ధరించి విధుల్లో పాల్గొనాలని సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ సిటీ ప్లానర్ రఘునాథరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్. ఓ.దినేష్,సర్వేయర్ కామేశ్వరరావు, ఇంజనీరింగ్ విభాగం ఏ.ఈ ఫాజిల్, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.