ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తికర చర్చ.. వనం ప్రసాద్‌కు సన్మానం!
వ్యవసాయ పద్ధతులు, ఫిజియోథెరపీపై పరస్పర అభిప్రాయాల పంచుకోలు
చౌటుప్పల్, మేజర్ న్యూస్:ప్రకృతి వనం ప్రసాద్ నిర్వహిస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని ఫిజియోథెరపిస్ట్ డా. గుండెబోయిన రమేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా సందర్శించి, వనం ప్రసాద్‌తో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన తన తండ్రి స్థూప ఆవిష్కరణ కార్యక్రమంలోని మధురస్మృతులను గుర్తుచేసుకున్నారు. అప్పటి అనుభవాలను పరస్పరం పంచుకుంటూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.
అనంతరం వ్యవసాయ క్షేత్రంలో అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి వనం ప్రసాద్‌ను డా. రమేష్ యాదవ్ అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానాలు, సాగులో అనుసరిస్తున్న పద్ధతులు తదితర అంశాలపై ఆసక్తిగా చర్చించారు. అలాగే ఫిజియోథెరపీ ప్రాధాన్యం, ఆరోగ్య పరిరక్షణలో దాని ఉపయోగాలు, చికిత్సా విధానాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా వనం ప్రసాద్ యోగిత దంపతులను డా. గుండెబోయిన రమేష్ యాదవ్ శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, వ్యవసాయం, ఆరోగ్యం వంటి విభిన్న అంశాలపై చర్చించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.