అట్టహాసంగా ఎంపిటిసి స్థానానికి గూడలి నామినేషన్.
ముత్తుకూరు , మేజర్ న్యూస్ : మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రానికి కృష్ణపట్నం నుంచి తెలుగు తమ్ముళ్లు భారీగా తరలివచ్చారు. ఎన్నికల నిబంధనలు పాటించారు. కృష్ణపట్నం బిట్-1 ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గూడలి రేవతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో అపార్టీ నాయకులు రాగాల శివ కృష్ణ, మామిడాల శ్రీనివాసులు, వెంకటాద్రి, మొలకయ్య, జయంతి, మధుసూదన్ రావు, శివరాం ప్రసాద్ శర్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు