అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్తత: టీడీపీ నేత పవన్‌కుమార్‌రెడ్డి కారు దగ్ధం
సదుం / అన్నమయ్య జిల్లా:అన్నమయ్య జిల్లా సదుంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత పవన్‌కుమార్‌రెడ్డికి చెందిన కారును గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి దారుణంగా దగ్ధం చేశారు. కారుకు నిప్పుపెట్టడంతో అది పూర్తిగా బూడిదైంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కారును ఎవరు, ఎందుకు దగ్ధం చేశారనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో సదుంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కడంతో పాటు స్థానికంగా కలకలం రేగింది.