BREAKING
పటిష్టంగా స్ట్రాంగ్ రూమ్ ల భద్రత... పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు - సీఐ శివరామకృష్ణారెడ్డి నాయనా.. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాం.. - మేయర్ అభ్యర్థి రమేష్ ప్రచారంలో ఓటర్ల భరోసా పలమనేరు 25వ వార్డులో జోరుగా టీడీపీ ప్రచారం ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ షేక్‌ అజీమోద్దీన్‌కు ఘన సన్మానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎస్పీ స్నేహ మెహ్రా ఘన స్వాగతం కొప్పుల వెలమలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిందే!.. మనసులు కలిస్తే మంచి పరిణామమే! రజినీకాంత్ జైలర్ 2 సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసలు.. ఆ ఫీట్ తలైవాకే సాధ్యమంటూ! *ఆనందపురం జెడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బాలి రాంబాబు నాయుడు నామినేషన్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైకాపాను వీడి తెదేపాలో చేరిక జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున హబీబ్ భాషా నామినేషన్ దాఖలు వెటర్నరీ కళాశాలలో ప్రవేశాలు షురూ...

పమిడిపాడులో ఘనంగా ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు

Select Suryaa Now
పమిడిపాడులో ఘనంగా ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు

నరసరావుపేట మేజర్ న్యూస్ : మండలం లోని పమిడిపాడు గ్రామంలో జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథులుగా హాజరై అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున పమిడిపాడు–1 ఎంపీటీసీ అభ్యర్థి గా శీలం తిరుపతి స్వాములు, పమిడి పాడు–2 ఎంపీటీసీ అభ్యర్థిగా మట్టం పెద్దబ్బాయ్ నామినేషన్లు దాఖలు చేశారు.అనంతరం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా జనసేన, తెదేపా, భాజపా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేసి అభ్యర్థుల విజయానికి పాటుపడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నరసరావు పేట సమన్వయకర్తలు వీరవల్లి వంశీ, షేక్ అద్రుఫ్, బెల్లంకొండ అనిల్‌తో పాటు జనసేన, తెదేపా, భాజపా కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్, మల్లికార్జునరావు, పల్నాడు జిల్లా ఇంచార్జి..