కొడవలూరు మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..
కొడవలూరు , మేజర్ న్యూస్ : కొడవలూరు జడ్పీటీసీ అభ్యర్థిగా తాటిపర్తి సునీత.. మండలంలోని వివిధ గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థుల ప్రకటన. మాజీ మంత్రివర్యులు, కోవూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు కొడవలూరు మండలానికి చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పార్టీ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.కొడవలూరు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా శ్రీమతి తాటిపర్తి సునీతను ప్రకటించారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి ఎంపీటీసీ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు..
ఎంపీటీసీ అభ్యర్థుల వివరాలు:
1. కొడవలూరు: శ్రీమతి కోడూరు శివలీల
2. దామేగుంట: వీరి సురేష్ కుమార్
3. కొత్తవంగల్లు: శ్రీమతి చక్కా ప్రమీల
4. రేగడిచిలక: దేవానబోయిన నాగేంద్ర
5. నార్త్ రాజుపాలెం–1: గండవరపు ఉమ
6. నార్త్ రాజుపాలెం–2: చేవూరు వేణు
7. రామన్నపాలెం: ఇందూరు బాలభాస్కర్ రెడ్డి
8. గండవరం: శ్రీమతి పెనాక కుసుమ
9. ఎల్లాయపాలెం–1: శ్రీమతి జడ్డా అమరావతి
10. ఎల్లాయపాలెం–2: కట్ట రమణయ్య
11. పెమ్మారెడ్డిపాలెం: చిట్టేటి మల్లికార్జున
12. తలమంచి: శ్రీమతి యాటగిరి పుష్ప
13. కమ్మపాలెం: శ్రీమతి తలతోటి విమల
14. గౌతమి నగర్: దేవరకొండ శ్రీనివాసులు
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రకటించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు చిమటా శేషగిరి, వైసీపీ సీనియర్ నాయకులు అడపాల మోహన్ కృష్ణ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.