శ్రీ రవీంద్ర విద్యా నికేతన్‌లో ఘనంగా ఆయుధ పూజ
శ్రీ రవీంద్ర విద్యా నికేతన్‌లో ఘనంగా ఆయుధ పూజ
– పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది ఆధ్వర్యంలో వేడుకలు
గుడిబండ మేజర్ న్యూస్:
గుడిబండ మండల కేంద్రంలోని శ్రీ రవీంద్ర విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో ఆయుధ పూజా కార్యక్రమాన్ని ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, డ్రైవర్లు, సహాయక సిబ్బంది పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దసరా పండుగను పురస్కరించుకుని పాఠశాల ప్రాంగణాన్ని అందంగా అలంకరించడంతో పండుగ వాతావరణం నెలకొంది. పాఠశాల కుటుంబ సభ్యుల శ్రేయస్సు, సుఖసంతోషాలు, అభివృద్ధి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ దైవానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయుధ పూజలో భాగంగా పాఠశాలకు చెందిన వాహనాలు, విద్యా పరికరాలు, ఇతర పనిముట్లకు పూజలు నిర్వహించారు.పాఠశాల అభివృద్ధికి అంకితభావంతో సేవలందిస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది, డ్రైవర్లు, ఆయాలకు యాజమాన్యం దసరా కానుకగా దుస్తులు, మిఠాయిలను పంపిణీ చేసింది. సిబ్బంది సేవలను గుర్తిస్తూ పండుగ సందర్భంగా కానుకలు అందించడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల కుటుంబ సభ్యులు ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అందరూ ఐకమత్యంతో, సుఖసంతోషాలతో ఉండాలని, శ్రీ రవీంద్ర విద్యా నికేతన్ పాఠశాల భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.