మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన మరాఠి శివప్రసాద్
వికారాబాద్, మేజర్ న్యూస్: విజయదశమి పండుగను పురస్కరించుకుని మరాఠి శివప్రసాద్ గారు జహీరాబాద్‌లోని మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ గారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జమ్మి ఆకులు సమర్పించి, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.విజయదశమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు నింపాలని ఆకాంక్షిస్తూ పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగ సంతోషాలను పంచుకున్నారు.