కృష్ణారెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేత దాము
కొడంగల్, మేజర్ న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డిని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ పట్టణ వర్కింగ్ ప్రసిడెంట్ దాము కొండారెడ్డిపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొడంగల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల గురించి కృష్ణారెడ్డి అడిగి తెలుసుకున్నట్లు దాము వెల్లడించారు. పట్టణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, వాటి పురోగతికి సంబంధించిన వివరాలను ఆయనకు వివరించినట్లు తెలిపారు.
రిపోర్టర్: ఆబీద్, కొడంగల్, వికారాబాద్ జిల్లా