BREAKING
రుద్రవనం పీఎస్ ట్రైలర్ రిలీజ్ అక్టోబర్ 30 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న నరేష్ అగస్త్య క్రైమ్ థ్రిల్లర్ తుల్జా భవాని మాత ఉత్సవాలు కళాకారునిలకు చీరలు పంపిణీ రమేష్ గౌడ్‌ను కలిసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు మేయర్ అభ్యర్థి విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడి మైఖేల్ జాక్సన్ బయోపిక్‌కు గోల్డెన్ గ్లోబ్స్ షాక్ మ్యూజికల్ కేటగిరీ తిరస్కరణ సేవ చేసే చేతులకు దసరా కానుక.. మున్సిపల్ మహిళా సిబ్బందికి చీరల పంపిణీ చేసిన అక్కల సురేష్ కుమార్ దంపతులు 13 వ వార్డు లో వైసీపీ గెలుపు ఖాయం *దూసుకుపోతున్న అభ్యర్థి ముని మాధవి తులసిరావు* నామినేషన్స్ సందర్భంగా ఎండిఓ కార్యాలయం వద్ద గట్టి పోలీసు బందోబస్తు గుంటూరు : 28న ఆ ప్రాంతాలలో సెలవు ప్రకటించిన కలెక్టర్ ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. జైలర్ 2 క్లైమాక్స్ లో మోహన్ లాల్ డ్యూప్ వార్తలపై స్పందించిన యాక్షన్ డైరెక్టర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ అన్నదానం పుణ్యకార్యం సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఘనంగా కిచ్చా సుదీప్ 25వ వివాహ వార్షికోత్సవం భార్య ప్రియతో దండలు మార్చుకుంటూ సరదా క్షణాలు వెంకటేష్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47 రిలీజ్ డేట్ ఖరారు అక్టోబర్ 30న థియేటర్లలోకి

శ్రీలంకలో జననం... కళ్యాణదుర్గం కోడలిగా రాజకీయ ప్రస్తావం.

Select Suryaa Now
శ్రీలంకలో జననం... కళ్యాణదుర్గం కోడలిగా రాజకీయ ప్రస్తావం.

కళ్యాణదుర్గం: శ్రీలంకలో జన్మించి, కళ్యాణదుర్గం కోడలిగా అడుగుపెట్టిన బుట్నా లక్ష్మీ తిమ్మరాజు ప్రస్తుతం కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవికి కూటమి అభ్యర్థిగా నిలిచారు. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే భర్త బుట్నా తిమ్మరాజుకు వ్యాపార, రాజకీయ వ్యవహారాల్లో చేదోడువాదోడుగా నిలుస్తూ వచ్చిన ఆమెకు కూటమి నాయకత్వం చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ రాజకీయ నేపథ్యం, భర్త రాజకీయ ప్రస్థానం, ప్రజలతో ఉన్న అనుబంధం చర్చనీయాంశంగా మారాయి. బుట్నా లక్ష్మీ తిమ్మరాజు కుటుంబానికి కళ్యాణదుర్గం రాజకీయాలతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆమె మామ బుట్నా కృష్ణమూర్తి 1980లో కళ్యాణదుర్గం సర్పంచ్‌గా పనిచేశారు. ఆ కాలంలో స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజా వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషించినట్లు కుటుంబ వర్గాలు పేర్కొంటున్నాయి. కుటుంబంలో కొనసాగిన రాజకీయ వారసత్వాన్ని ఆమె భర్త బుట్నా తిమ్మరాజు కూడా కొనసాగించారు. బుట్నా తిమ్మరాజు గత ఐదు దశాబ్దాలుగా కళ్యాణదుర్గంలో వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. మరోవైపు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీతో అనుబంధం కొనసాగిస్తూ రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ వచ్చారు. పార్టీ పట్ల విధేయతతో పాటు స్థానిక ప్రజలతో సంబంధాలను కొనసాగిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. 1992లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో కళ్యాణదుర్గం సర్పంచ్ పదవికి తొలిసారిగా పోటీ చేసిన బుట్నా తిమ్మరాజు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ రాజకీయాల నుంచి వెనక్కి తగ్గకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఆయన సేవలను, పార్టీ పట్ల నిబద్ధతను గుర్తించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం 1995లో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఈ అవకాశం ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. అనంతరం కూడా బుట్నా తిమ్మరాజు కళ్యాణదుర్గం పట్టణ ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వ్యాపార, సామాజిక, రాజకీయ రంగాల్లో తన కార్యకలాపాలను విస్తరించారు. కుటుంబ బాధ్యతల్లో భాగస్వామిగా ఉన్న బుట్నా లక్ష్మీ తిమ్మరాజు కూడా భర్తకు అండగా నిలుస్తూ వచ్చారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఆమెకు అవకాశం లభించడంతో కుటుంబ రాజకీయ నేపథ్యం మరోసారి తెరపైకి వచ్చింది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, పార్టీ శ్రేణుల సూచనల మేరకు బుట్నా లక్ష్మీ తిమ్మరాజును టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కుటుంబానికి ఉన్న రాజకీయ అనుభవం, భర్తకు ఉన్న పార్టీ అనుబంధం, స్థానికంగా కొనసాగుతున్న పరిచయాలు ఆమె అభ్యర్థిత్వానికి తోడ్పడిన అంశాలుగా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మొత్తంగా, శ్రీలంకలో జన్మించి కళ్యాణదుర్గం కోడలిగా జీవితాన్ని ప్రారంభించిన బుట్నా లక్ష్మీ తిమ్మరాజు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ చేయడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఆమె అభ్యర్థిత్వం కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో, ఓటర్లు ఆమెకు ఏ మేరకు మద్దతు పలుకుతారో ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.

కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :-రంగస్వామి.