పరిగి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న లారీ.. యువకుడు మృతి
పరిగి, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పరిగి మండలం రాఘంపల్లి సమీపంలో లారీ, బైక్ ఢీకొన్న ప్రమాదంలో బుద్ధాపూర్ తండాకు చెందిన నేనావత్ రవి (28) మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.వివరాల్లోకి వెళ్తే.. పరిగి మండలం రాఘంపల్లి సమీపంలో లారీ, బైక్ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న నేనావత్ రవి తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.