టిడిపి రెబల్స్ కు ఎమ్మెల్యే గల్లా మాధవి స్ట్రాంగ్ వార్నింగ్
అనిల్ కాంత్.కె.....గుంటూరు ప్రతినిధి
స్థానిక ఎన్నికలలో పార్టీ దిశా,నిర్దేశాలను పాటించకుండా, పార్టీ గౌరవాన్ని కాపాడకుండా ఎవరైనా రెబల్స్ గా కానీ,ఇండిపెండెంట్లుగా పోటీకి దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. పొత్తులో భాగంగా 25టీడీపీ,6జనసేన,3సీట్లను బీజేపీ కు కేటాయించడం జరిగిందని, కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పలువురు ఆశావాహులకు సీట్లు రాలేదని,సీట్లు దక్కని వారికి తాను సముచిత స్థానం కల్పిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కూటమి పొత్తు ధర్మాన్ని పాటించి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.