BREAKING
ముండ్లమూరు మండల జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా మందలపు లాస్య. వైసీపీ పార్టీ తరఫున నెక్కుంది ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన హేమలత! *అశ్వరావుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం* నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహరచన ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి, జారే ఆదినారాయణ టాలీవుడ్ స్టార్ హీరో ఉదయ్ కిరణ్ సినిమా అవకాశాలపై నటి రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ ట్రెండింగ్‌గా సూరి, సుహాస్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో రికార్డ్ కొడవలూరు మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. టాలీవుడ్‌కు చందమామ కాజల్ అగర్వాల్ దూరం.. బాలీవుడ్ బాట పట్టిన స్టార్ హీరోయిన్ రామగోపాల్ వర్మ సంచలన చిత్రం పోలీస్ కంపెనీ విడుదల తేదీ ఖరారు.. అసలు కథ ఏమిటంటే వైసీపీలో చేరిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు. పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్ తేడాలా?* *అయోమయంలో ఎంపీటీసీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు* టిడిపి రెబల్స్ కు ఎమ్మెల్యే గల్లా మాధవి స్ట్రాంగ్ వార్నింగ్

మంత్రాలయంలో టీడీపీ–వైసీపీ మధ్య రణరంగం!

Select Suryaa Now
మంత్రాలయంలో టీడీపీ–వైసీపీ మధ్య రణరంగం!

మంత్రాలయంలో టీడీపీ–వైసీపీ మధ్య రణరంగం!

వైసీపీ మండల ఇన్‌చార్జిపై దాడి.. పోలీసుల తీరుపై విమర్శలు

మంత్రాలయం రూరల్, మేజర్ న్యూస్:

మంత్రాలయం మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ మండల ఇన్‌చార్జి విశ్వనాథరెడ్డిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. పట్టపగలే సుమారు పది నిమిషాల పాటు గొడవ కొనసాగినప్పటికీ, అక్కడే ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్ర వహించారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. వగరూరు గ్రామ ఎంపీటీసీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసేందుకు వైసీపీ మండల ఇన్‌చార్జి విశ్వనాథరెడ్డి అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు ఆయనను దుర్భాషలాడుతూ మూకుమ్మడిగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఈ ఘటన సమయంలో ఏఎస్పీ కృష్ణమోహన్‌, డీఎస్పీ శ్రీనివాసులు అక్కడే ఉన్నప్పటికీ, దాడిని అడ్డుకోవడంలో వారు తక్షణమే స్పందించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అనంతరం పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఇరువర్గాల మధ్య నెలకొన్న గొడవను సద్దుమణిగేలా చేశారు. ఆ తర్వాత వైసీపీ నాయకుడు విశ్వనాథరెడ్డిని అక్కడి నుంచి పంపించారు.

ఎన్నికల నామినేషన్ల సమయంలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా సాగేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైసీపీ నాయకులు భయం లేకుండా నామినేషన్లు దాఖలు చేయగలరా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం ఇలాంటి ఘటనలపై సమర్థవంతంగా స్పందించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నాగరాజు, సూర్య ప్రతినిధి మంత్రాలయం కర్నూలు జిల్లా