BREAKING
ముండ్లమూరు మండల జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా మందలపు లాస్య. వైసీపీ పార్టీ తరఫున నెక్కుంది ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన హేమలత! *అశ్వరావుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం* నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహరచన ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి, జారే ఆదినారాయణ టాలీవుడ్ స్టార్ హీరో ఉదయ్ కిరణ్ సినిమా అవకాశాలపై నటి రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ ట్రెండింగ్‌గా సూరి, సుహాస్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో రికార్డ్ కొడవలూరు మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. టాలీవుడ్‌కు చందమామ కాజల్ అగర్వాల్ దూరం.. బాలీవుడ్ బాట పట్టిన స్టార్ హీరోయిన్ రామగోపాల్ వర్మ సంచలన చిత్రం పోలీస్ కంపెనీ విడుదల తేదీ ఖరారు.. అసలు కథ ఏమిటంటే వైసీపీలో చేరిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు. పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్ తేడాలా?* *అయోమయంలో ఎంపీటీసీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు* టిడిపి రెబల్స్ కు ఎమ్మెల్యే గల్లా మాధవి స్ట్రాంగ్ వార్నింగ్

రొంపిచర్లలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి

Select Suryaa Now
రొంపిచర్లలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి

నరసరావుపేట మేజర్ న్యూస్ :

నరసరావుపేట రొంపిచర్ల మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీటీసీ నామినేషన్ దాఖలు చేసేందుకు తన అనుచరులతో బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నామినేషన్ కేంద్రం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరోవైపు ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని రహదారిపై పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు మోహరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. టీడీపీ, వైసీపీ వర్గీయులను ఎక్కడికక్కడ చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నరసరావుపేట నుంచి రొంపిచర్లకు అదనపు పోలీసు బలగాలు బయలుదేరాయి. రొంపిచర్ల మండల కేంద్రంలో నెలకొన్న పరిణామాలతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. పోలీసులు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

రిపోర్టర్ మల్లికార్జునరావు, పల్నాడు జిల్లా ఇంచార్జి.