BREAKING
హెడ్ కానిస్టేబుల్ బాబు మృతి పోలీస్ శాఖకు తీరని లోటు ముండ్లమూరు మండల జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా మందలపు లాస్య. వైసీపీ పార్టీ తరఫున నెక్కుంది ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన హేమలత! *అశ్వరావుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం* నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహరచన ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి, జారే ఆదినారాయణ టాలీవుడ్ స్టార్ హీరో ఉదయ్ కిరణ్ సినిమా అవకాశాలపై నటి రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ ట్రెండింగ్‌గా సూరి, సుహాస్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో రికార్డ్ కొడవలూరు మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. టాలీవుడ్‌కు చందమామ కాజల్ అగర్వాల్ దూరం.. బాలీవుడ్ బాట పట్టిన స్టార్ హీరోయిన్ రామగోపాల్ వర్మ సంచలన చిత్రం పోలీస్ కంపెనీ విడుదల తేదీ ఖరారు.. అసలు కథ ఏమిటంటే వైసీపీలో చేరిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు. పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్ తేడాలా?* *అయోమయంలో ఎంపీటీసీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు*

*ప్రభుత్వం మౌనం వీడి.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు న్యాయం చేయాలి* *ప్రభుత్వం స్పందించకపోతే కారంమెతుకులే దిక్కు!* *– ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్‌* *

Select Suryaa Now
*ప్రభుత్వం మౌనం వీడి.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు న్యాయం చేయాలి*  *ప్రభుత్వం స్పందించకపోతే కారంమెతుకులే దిక్కు!*  *– ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్‌*  *

ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలించి పరిష్కరించాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ ఎలాంటి షరతులు లేకుండా క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఎన్‌హెచ్‌ఎం జేఏసీ నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్‌  డిమాండ్‌ చేశారు. ఎన్‌హెచ్‌ఎం జేఏసీ నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది. కరీ పండుగ రోజున కూడా ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన కొనసాగించారు. ఇందులో భాగంగా మౌనదీక్ష చేపట్టి, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మధ్యాహ్న భోజన సమయంలో గొడ్డుకారంతో భోజనం చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటుండగా, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు మాత్రం ఉద్యోగ భద్రత, భవిష్యత్తుపై ఆందోళనతో పండుగను నిరాశతో గడపాల్సి వస్తోందని  ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల కుటుంబాలు కూడా ఈ పరిస్థితుల వల్ల మానసిక ఆవేదనకు గురవుతున్నాయని పేర్కొన్నారు. పండుగ రోజున కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి రావడం ఉద్యోగుల సమస్యల తీవ్రతను తెలియజేస్తోందన్నారు. ప్రభుత్వం ఇకనైనా మౌనం వీడి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రజారోగ్య సేవల్లో భాగస్వాములవుతున్న ఉద్యోగుల సేవలను గుర్తించి, వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ ఎలాంటి షరతులు లేకుండా క్రమబద్ధీకరించి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి డిమాండ్లను పరిష్కరించే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో  ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసులు, డాక్టర్‌ రాజు, డాక్టర్‌ అక్బర్‌, డాక్టర్‌ యూసుఫ్‌ నవీద్‌, డాక్టర్‌ ఉమేరా, డాక్టర్‌ సురేష్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు రజియా, చంద్రకళ, వనజతో పాటు పలువురు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు పాల్గొన్నారు.

పి.వినయ్ కుమార్,  నాగర్‌కర్నూల్‌ క్రైమ్ సూర్యన్యూస్