ఎమ్మెల్యేను కలిసిన బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్
మణుగూరు ఆర్ సి సూర్య ; బూర్గంపాడు మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తోలెం కళ్యాణి బుధవారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు.తొలుత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నూతన బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ తోలెం కళ్యాణిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తోలెం కళ్యాణి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు.
కార్యక్రమంలో మద్దెల సమ్మయ్య పొట్లపల్లి సర్పంచ్, తోలెం మల్లేష్, తాల్ల గుట్టయ్య,మాజీ ఎంపిపి పడిగ నాగయ్య, తోలెం క్రిష్ణ, షేక్ మధార్, పడిగ వీరబాబు, కొమరం శ్రీను, తోలెం అర్జున్, బడే వెంకటేశ్వర్లు, తోలెం సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా