ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు పటిష్ట బందోబస్తు... నాలుగు అంచెలుగా పోలీసు భద్రతా ఏర్పాట్లు
పరిగి మేజర్ న్యూస్: బుధవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పరిగి ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మొత్తం ప్రాంతాన్ని నాలుగు అంచెలుగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ రవికుమార్ కోరారు.
పరిగి సూర్య రిపోర్టర్ నవీన్