BREAKING
ముండ్లమూరు మండల జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా మందలపు లాస్య. వైసీపీ పార్టీ తరఫున నెక్కుంది ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన హేమలత! *అశ్వరావుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం* నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహరచన ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి, జారే ఆదినారాయణ టాలీవుడ్ స్టార్ హీరో ఉదయ్ కిరణ్ సినిమా అవకాశాలపై నటి రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ ట్రెండింగ్‌గా సూరి, సుహాస్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో రికార్డ్ కొడవలూరు మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. టాలీవుడ్‌కు చందమామ కాజల్ అగర్వాల్ దూరం.. బాలీవుడ్ బాట పట్టిన స్టార్ హీరోయిన్ రామగోపాల్ వర్మ సంచలన చిత్రం పోలీస్ కంపెనీ విడుదల తేదీ ఖరారు.. అసలు కథ ఏమిటంటే వైసీపీలో చేరిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు. పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్ తేడాలా?* *అయోమయంలో ఎంపీటీసీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు* టిడిపి రెబల్స్ కు ఎమ్మెల్యే గల్లా మాధవి స్ట్రాంగ్ వార్నింగ్

వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

Select Suryaa Now
వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్:కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్దుర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయాన్ని సందర్శించి, పరిశీలించారు.  ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ... కర్నూలు జిల్లాలోని 26 మండలాల్లో ఎంపీటీసీ ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియ ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైందని తెలిపారు. 26 మండల ఎంపీడీఓ ఆఫీసులతో పాటు కర్నూలు జిల్లా పరిషత్ (జెడ్పీ) ఆఫీసులో జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ జరుగుతోందని పేర్కొన్నారు.  మొత్తం 27 కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్లు, 500 మీటర్ల వద్ద కటాఫ్ పరిమితులు విధించామని వివరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను మోహరించి, నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో వెల్దుర్తి సర్కిల్ ఇన్ స్పెక్టర్ (సీఐ) యుగంధర్, స్థానిక సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్ఐ) నరేష్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం