పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనిది
సూర్య చందుర్తి :పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనిది అని శాంతి భద్రతల పరిరక్షణకై విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ మహేష్ బి గితె అన్నారు.జిల్లాలోని చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో ఉన్న పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్ డే) నిర్వహించి, అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులతో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
అనంతరం సాయుధ పోలీసులుశోక్ శ్రస్త్ నిర్వహించి, మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు, సిబ్బంది అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధి నిర్వహణలో మరణించిన 154 మంది పోలీస్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు.ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకై సవాళ్లను ధీటుగా ఎదురించి, ప్రాణాలను సైతం త్యాగం చేసి, విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని పేర్కొన్నారు. జిల్లాలో అంతర్గత భద్రత పరిరక్షణ విధుల్లో 08 మందికి పైగా పోలీసులు అసువులు బాసారని, వారి త్యాగఫలం వల్లే గతం కంటే ప్రస్తుత పరిస్థితి మెరుగ్గా ఉందని, పోలీసుల త్యాగనిరతిని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, విధి నిర్వహణలో భాగంగా ఎన్నో జఠిలమైన సవాళ్లు ఎదురవుతున్నా అమరవీరులు అందించిన స్ఫూర్తితో ప్రజల భద్రత, రక్షణ చర్యల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామని అన్నారు.
దేశ సరిహద్దుల్లోని ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో పహార కాస్తున్న సిఆర్పిఎఫ్ పోలీసులను 1959లో ఇదే రోజున చైనా దేశానికి చెందిన సైనికులు హతమార్చారని, అప్పటినుండి వారి త్యాగాలను స్మరిస్తూ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినం జరుపుకోవడం జరుగుతున్నదని పేర్కొన్నారు.
ఈకార్యక్రమానికి హాజరైన అమరవీరుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు, వారి యొక్క సమస్యలను ఎస్పీ గారు ఆరా తీశారు.వారు విన్నవించిన సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందజేశారు.పోలీస్ అమరవీరులను స్మరిస్తూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నుండి 31 వరకు రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీ, క్యాండిల్ ర్యాలీ, రన్, ఓపెన్ హౌస్, వ్యాసరచన పోటీలు, ఫోటో, వీడియో పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.ఈకార్యక్రమంలో పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, డిఎస్పీ లు నాగేంద్రచారి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సి.ఐ లు, ఆర్.ఐ లు,ఎస్.ఐ లు, ఆర్.ఎస్.ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.