21వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా కేశవ నాయుడుకు బీ ఫారం అందజేత..
(అనంతపురము, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)
అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 21వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా కేశవ నాయుడు బీ-ఫారం అందుకున్నారు. పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆయనకు అధికారికంగా బీ-ఫారం అందజేయడంతో 21వ డివిజన్‌లో ఎన్నికల సందడి నెలకొంది.కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కేశవ నాయుడు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. రానున్న ఎన్నికల్లో డివిజన్ ప్రజల మద్దతుతో విజయం సాధించేందుకు ఆయన ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసే అవకాశం ఉంది.కేశవ నాయుడు అభ్యర్థిత్వంతో 21వ డివిజన్ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారనుంది.