BREAKING
మరికొన్ని గంటల్లో 'బన్ని ఉత్సవం'.. డి.ఎస్.పి ఉద్యోగం సాధించిన మహేష్ గౌడ్ కు శాలువాతో సన్మానం పమిడిపాడులో ఘనంగా ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు హెడ్ కానిస్టేబుల్ బాబు మృతి పోలీస్ శాఖకు తీరని లోటు ముండ్లమూరు మండల జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా మందలపు లాస్య. వైసీపీ పార్టీ తరఫున నెక్కుంది ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన హేమలత! *అశ్వరావుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం* నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహరచన ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి, జారే ఆదినారాయణ టాలీవుడ్ స్టార్ హీరో ఉదయ్ కిరణ్ సినిమా అవకాశాలపై నటి రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ ట్రెండింగ్‌గా సూరి, సుహాస్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో రికార్డ్ కొడవలూరు మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. టాలీవుడ్‌కు చందమామ కాజల్ అగర్వాల్ దూరం.. బాలీవుడ్ బాట పట్టిన స్టార్ హీరోయిన్ రామగోపాల్ వర్మ సంచలన చిత్రం పోలీస్ కంపెనీ విడుదల తేదీ ఖరారు.. అసలు కథ ఏమిటంటే

ప్రభాస్ భారీ సినిమా తప్పుకోవడంతో.. ఆ పెద్ద డేట్‌ను లాక్ చేసిన 'ఎల్లమ్మ' మూవీ

Select Suryaa Now
ప్రభాస్ భారీ సినిమా తప్పుకోవడంతో.. ఆ పెద్ద డేట్‌ను లాక్ చేసిన 'ఎల్లమ్మ' మూవీ

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద సినిమాల విడుదల తేదీల మార్పులు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ స్పిరిట్ సినిమా విడుదల తేదీపై కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చలకు తెరపడింది. ఈ చిత్రానికి సంబంధించి ముందుగా మార్చి 5వ తేదీని లాక్ చేసినప్పటికీ, షూటింగ్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో ఈ భారీ ప్రాజెక్ట్‌ను వేసవి నుంచి దీపావళికి వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనితో బాక్సాఫీస్ వద్ద అత్యంత కీలమైన మార్చి తొలి వారపు స్లాట్ ఒక్కసారిగా ఖాళీ కావడంతో టాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.

ప్రభాస్ సినిమా తప్పుకున్న ఆ ఖాళీ తేదీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత వ్యూహాత్మకంగా తమ కొత్త సినిమా కోసం వినియోగించుకున్నారు. బలగం సినిమాతో సంచలన విజయం సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న తాజా రూటెడ్ రస్టిక్ డ్రామా ఎల్లమ్మ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కానుండటం విశేషం. తాజాగా మేకర్స్ అధికారికంగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా ఈ సినిమా విడుదల తేదీని మార్చి 5వ తేదీగా ఖరారు చేశారు.

ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా తప్పుకున్నప్పటికీ, అదే తేదీకి విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఎల్లమ్మ సినిమా ప్రేక్షకులకు మరో సాలిడ్ థియేట్రికల్ అనుభూతిని పంచడానికి సిద్ధమవుతోంది. గ్రామీణ వాతావరణం, పల్లెటూరి నూతన భావోద్వేగాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా సంగీతం అందిస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అత్యున్నత ప్రమానాలతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.