BREAKING
వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వైసిపి నేత కారుపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి *పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం* రొంపిచర్లలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి ఉదయాన్నే పచ్చగడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని ఆరోగ్య లాభాలా.. నిపుణులు ఏమంటున్నారంటే పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయం పురాణాల నుంచి ఏఐ ప్రపంచం వరకు.. 'ది ప్రాంప్ట్ వార్' టైటిల్ అనౌన్స్మెంట్ ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు పటిష్ట బందోబస్తు... నాలుగు అంచెలుగా పోలీసు భద్రతా ఏర్పాట్లు నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కోలీవుడ్ స్టార్ హీరోతో బుచ్చిబాబు సానా నెక్స్ట్ ప్రాజెక్ట్.. యాక్షన్ డ్రామాగా భారీ చిత్రం! మున్సిపల్ ఎన్నికలపై ఉద్యోగులకు గుంటూరు కమిషనర్ కీలక ఆదేశాలు ఓటీటీలో సత్తా చాటుతున్న 'వసుదేవసుతం'.. త్వరలోనే ప్రీక్వెల్ అంటూ దర్శకుడు వైకుంఠ బోను ప్రకటన! *ప్రభుత్వం మౌనం వీడి.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు న్యాయం చేయాలి* *ప్రభుత్వం స్పందించకపోతే కారంమెతుకులే దిక్కు!* *– ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్‌* * మంత్రాలయంలో టీడీపీ–వైసీపీ మధ్య రణరంగం! తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ఎప్పుడూ గౌరవిస్తాను – ఆచంట సునీత

బాన్సువాడలో ఘనంగా రావణదహన కార్యక్రమం

Select Suryaa Now
బాన్సువాడలో ఘనంగా రావణదహన కార్యక్రమం

సూర్య బాన్సువాడ:విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో మంగళవారం రాత్రి నిర్వహించిన రావణదహన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే  పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వరుసగా 16వ సంవత్సరం నిర్వహించిన ఈ రావణదహన కార్యక్రమానికి బాన్సువాడ పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రావణదహనంతో మినీ స్టేడియం పండుగ సందడితో కళకళలాడింది. 

అనంతరం బాన్సువాడ గ్రామీణ మండలంలోని తన స్వగ్రామమైన పోచారం గ్రామంలో హనుమాన్ మందిరం వద్ద జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గ్రామస్థులకు జమ్మి ఆకులను పంపిణీ చేస్తూ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి,  పోచారం సురేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ తదితరులు పాల్గొన్నారు.