బోథ్‌లో మృతదేహాల ఫ్రీజర్ సదుపాయం ప్రారంభం
సూర్య బోథ్ :పట్టణ ప్రజలకు అత్యవసర సమయంలో ఉపయోగపడేలా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రోజున మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా విడిసి చైర్మన్ అల్లకొండ పోతన్న మాట్లాడుతూ, ప్రజల అవసరాలను గుర్తించి, వారికి ఉపయోగపడే సేవలను అందించాలనే ఉద్దేశంతో ఫ్రీజర్ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు
కుటుంబ సభ్యులు, బంధువులు ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎవరైనా మృతి చెందితే, వారు బోథ్‌కు చేరుకునే వరకు మృతదేహాన్ని భద్రపరచడం ఇబ్బందిగా మారుతోందని పోతన్న పేర్కొన్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఫ్రీజర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
అత్యవసర సమయంలో ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, పట్టణ ప్రజలకు అవసరమైన సేవలు అందించడమే గ్రామాభివృద్ధి కమిటీ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు సాధ్యమైనంత వరకు సహకారం అందించేందుకు కమిటీ కృషి చేస్తుందని
బోథ్ పట్టణ ప్రజలు ఈ సదుపాయాన్ని అవసరమైన సమయంలో వినియోగించుకోవాలన్నారు
ఈ కార్యక్రమంలో విడిసి చైర్మెన్ అల్లకొండ పోతన్న, ఉపాధ్యక్షులు యాసిన్, కోశాధికారి రాయిపెల్లి రమాకాంత్, ఎలుక రాజు, మల్లెపూల విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.