BREAKING
*అశ్వరావుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం* నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహరచన ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి, జారే ఆదినారాయణ టాలీవుడ్ స్టార్ హీరో ఉదయ్ కిరణ్ సినిమా అవకాశాలపై నటి రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ ట్రెండింగ్‌గా సూరి, సుహాస్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో రికార్డ్ కొడవలూరు మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. టాలీవుడ్‌కు చందమామ కాజల్ అగర్వాల్ దూరం.. బాలీవుడ్ బాట పట్టిన స్టార్ హీరోయిన్ రామగోపాల్ వర్మ సంచలన చిత్రం పోలీస్ కంపెనీ విడుదల తేదీ ఖరారు.. అసలు కథ ఏమిటంటే వైసీపీలో చేరిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు. పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్ తేడాలా?* *అయోమయంలో ఎంపీటీసీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు* టిడిపి రెబల్స్ కు ఎమ్మెల్యే గల్లా మాధవి స్ట్రాంగ్ వార్నింగ్ టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో సంచలన విషయాలు.. అసలు టార్గెట్ సల్మాన్ ఖానేనా? ఎమ్మెల్యేను కలిసిన బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్

అయ్యప్ప స్వాముల సేవలో అపూర్వ భక్తి.. పాలెపు రామారావు ఔదార్యం! 80 మంది స్వాములకు సొంత ఖర్చుతో బిక్షసేవాభావాన్ని చాటుకుంటున్న చెన్నూరు సొసైటీ అధ్యక్షులు*

Select Suryaa Now
అయ్యప్ప స్వాముల సేవలో అపూర్వ భక్తి.. పాలెపు రామారావు ఔదార్యం! 80 మంది స్వాములకు సొంత ఖర్చుతో బిక్షసేవాభావాన్ని చాటుకుంటున్న చెన్నూరు సొసైటీ అధ్యక్షులు*

సూర్య, కల్లూరు  అయ్యప్ప స్వామి మాలధారణ చేపట్టిన భక్తులకు సేవ చేయడం ఆ భగవంతుడికి సేవ చేసినట్లేనని భావిస్తూ,చెన్నూరు సొసైటీ అధ్యక్షులు పాలెపు రామారావు తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. కల్లూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామపంచాయతీ పరిధి రావికంపాడు గ్రామానికి చెందిన రామారావు అయ్యప్ప దీక్ష చేపట్టడంతో పాటు, దీక్షలో ఉన్న 80 మంది స్వాములకు తన స్వగృహంలో నిత్యం అల్పాహారం, భిక్ష ఏర్పాటు చేస్తూ, గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

అయ్యప్ప దీక్షలో భాగంగా నియమ నిష్ఠలతో పూజలు నిర్వహిస్తున్న స్వాములకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే సంకల్పంతో రామారావు ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతిరోజూ స్వాములకు అవసరమైన అల్పాహారం, భోజనాన్ని తన సొంత ఖర్చులతో సమకూరుస్తూ భక్తి భావాన్ని సేవా మార్గంలో చాటుకుంటున్నారు.

ఈ కార్యక్రమానికి అవసరమైన బియ్యం, కూరగాయలు, ఇతర వంట సామగ్రిని సైతం తన సొంత పైకం తోనే కొనుగోలు చేస్తున్నారు. వంటలు తయారు చేసే వంట మనిషితో పాటు సహాయకులకు కూడా తన స్వంత ఖర్చులతో పారితోషికం అందిస్తూ, అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

అయ్యప్ప స్వాముల సేవను ఒక బాధ్యతగా కాకుండా, స్వామివారి అనుగ్రహంతో లభించిన భాగ్యంగా భావిస్తున్న రామారావు సేవానిరతిని గ్రామస్థులు, దీక్షలో ఉన్న స్వాములు ప్రశంసిస్తున్నారు. భక్తి అంటే కేవలం పూజలు, దీక్షలకే పరిమితం కాకుండా తోటి భక్తులకు సేవ చేయడంలోనూ ఉందని ఆయన ఆచరణలో చూపిస్తున్నారు.

*అన్నదానమే మహాదానం.. సేవే నిజమైన భక్తి!*

అయ్యప్ప స్వాముల పట్ల భక్తి, తోటి భక్తుల పట్ల ఆప్యాయత, సేవ చేయాలనే తపన కలగలిపి పాలెపు రామారావు చేపడుతున్న ఈ అన్నసంతర్పణ కార్యక్రమం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. స్వాములకు ఆహారం అందించడంలోనే అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉన్నాయని భావిస్తూ ఆయన చేస్తున్న సేవను గ్రామస్థులు అభినందిస్తున్నారు.

సూర్య ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ