BREAKING
వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వైసిపి నేత కారుపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి *పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం* రొంపిచర్లలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి ఉదయాన్నే పచ్చగడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని ఆరోగ్య లాభాలా.. నిపుణులు ఏమంటున్నారంటే పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయం పురాణాల నుంచి ఏఐ ప్రపంచం వరకు.. 'ది ప్రాంప్ట్ వార్' టైటిల్ అనౌన్స్మెంట్ ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు పటిష్ట బందోబస్తు... నాలుగు అంచెలుగా పోలీసు భద్రతా ఏర్పాట్లు నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కోలీవుడ్ స్టార్ హీరోతో బుచ్చిబాబు సానా నెక్స్ట్ ప్రాజెక్ట్.. యాక్షన్ డ్రామాగా భారీ చిత్రం! మున్సిపల్ ఎన్నికలపై ఉద్యోగులకు గుంటూరు కమిషనర్ కీలక ఆదేశాలు ఓటీటీలో సత్తా చాటుతున్న 'వసుదేవసుతం'.. త్వరలోనే ప్రీక్వెల్ అంటూ దర్శకుడు వైకుంఠ బోను ప్రకటన! *ప్రభుత్వం మౌనం వీడి.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు న్యాయం చేయాలి* *ప్రభుత్వం స్పందించకపోతే కారంమెతుకులే దిక్కు!* *– ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్‌* * మంత్రాలయంలో టీడీపీ–వైసీపీ మధ్య రణరంగం! తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ఎప్పుడూ గౌరవిస్తాను – ఆచంట సునీత

యువత చూపు తెలుగుదేశం పార్టీ వైపు- మైనార్జీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్

Select Suryaa Now
యువత చూపు తెలుగుదేశం పార్టీ వైపు- మైనార్జీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్

సూర్య, నంద్యాల బ్యూరో: యువత తెలుగుదేశం పార్టీవైపు మొగ్గుచూపుతున్నారని మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. మంత్రి కార్యాలయంలో బుధవారం 42వ వార్డు సలీంనగర్కు చెందిన వైసీపీ సీనియర్ నాయకులు షేక్ మౌలాలి, షేక్ దాఆవలి, సికిందర్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మంత్రి వారికి పసుపు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలతో పాటు ప్రభుత్వం పాలనకు ఆకర్షితులై పెద్ద ఎత్తున ప్రజలు, ముఖ్యంగా యువత మొగ్గు చూపుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారికి సముచితస్ధానం, గౌరవం ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.కె.హిదాయత్లాఖాన్, ఫరూక్ (మున్నా) నూర్బాషా, సర్దార్, సనీరాబేగం, మా బాషా, అలీ, జమాల్ తదితరులు పాల్గొన్నారు
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*