BREAKING
దివంగత నటి సౌందర్యతో అనుబంధాన్ని తలచుకుని భావోద్వేగానికి గురైన సీనియర్ హీరోయిన్ ప్రేమ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కార్మిక నాయకుడు రెడ్డి అప్పలనాయుడు కి ప్రజా సంఘాల మద్దతు కడియంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం. డీఎస్పీ పర్యవేక్షణలో పటిష్ట పోలీసు బందోబస్తు నామినేషన్ల సందర్భంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదు కడియం ఎంపీపీ అభ్యర్థిగా రాజరాజేశ్వరి జక్కంపూడి రాజా సహా పార్టీ నేతల సంప్రదింపుల అనంతరం నిర్ణయం మెగా హీరోకు లైవ్‌లో ప్రపోజ్ చేసిన యాంకర్ శ్రీముఖి.. ఆయన ఇచ్చిన ఊహించని రిప్లై పి.గన్నవరం మండలంలో రెండో రోజు 33 నామినేషన్లు మల్లవరం పెదలంకలో దసరా నవరాత్రుల మహోత్సవాలు--మహిళల నృత్యాలతో అమ్మవారి ఊరేగింపు జిల్లాలో జడ్పీటీసీ అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ... కూతుళ్లతో కలిసి బిగ్‌బాస్ నటి చైత్ర రాయ్ దసరా వేడుకలు.. సామాజిక మాధ్యమాలలో ఫొటోలు వైరల్ అనపర్తిలో 28 నామినేషన్లు దాఖలు..ఇప్పటివరకు 49 నామినేషన్లు దాఖలు: కామవరపుకోటలో 49 నామినేషన్లు పిల్లల్లో విపరీతంగా పెరుగుతున్న చదువు ఒత్తిడి.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి నేదునూరులో పెళ్లి బృందం వ్యాన్ బోల్తా30 మందికి గాయాలు.. పెదపుల్లేరు జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా పాటూరి మోహన్

జనసందోహం నడుమ దసరా వైభవం.. ఇల్లెందు వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి*

Select Suryaa Now
జనసందోహం నడుమ దసరా వైభవం.. ఇల్లెందు వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి*

సూర్య ఇల్లందు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇల్లెందులో మంగళవారం అర్ధరాత్రి వరకు నిర్వహించిన దసరా వేడుకలు వైభవంగా సాగాయి. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి ఉత్సవాల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఇల్లెందులో దసరా వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తూ వేలాదిమంది పాల్గొనడం అభినందనీయమని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాల్లో భాగస్వాములు కావడం పండుగ ప్రత్యేకతను చాటుతోందన్నారు. కళాకారుల ఆటపాటలు, ప్రదర్శనలు, వారి ఉత్సాహం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోందని కొనియాడారు.
*ధర్మానికి విజయదశమి ప్రతీక*
చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ పర్వదినం సత్యం, ధర్మం పట్ల నిబద్ధతతో ముందుకు సాగాలనే సందేశాన్ని అందిస్తుందన్నారు. పండుగలు మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటంతోపాటు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, ఉత్సవ నిర్వాహకులు, కళాకారులు, పట్టణ ప్రజలు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.

సూర్య ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ