నేడు ఎల్ నినో ప్రభావాలపై అవగాహన సదస్సు
రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ : గత కొంతకాలం గా వాతావరణ మార్పుతో వర్షాలు లేక ఎండ తీవ్రత తో ప్రజలను భయాందోళనలు గురి చేస్తున్న ఎల్ నినో ప్రభావం తీసుకోవలసిన జాగ్రత్త ల పై అవగాహన కల్పించాలని భాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహణలలో పౌర సంబంధాల అధికారులు సాంస్కృతిక సారథి కళా కళాకారులు తో సదస్సు రవీంద్ర భారతి ప్రధాన వేదిక పై శుక్రవారం నిర్వహిస్తున్నామని భాష సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి రవీంద్ర భారతి లోని ఆయన కార్యాలయం లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు.
కళాకారులకు ఎల్ నినో ప్రభావాల పై అవగాహన కల్పించటం ద్వారా వారు గ్రామాల్లో సంబంధిత పౌర సంబంధాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ తమ కళా ప్రదర్శనలతో ప్రజలను జాగరూకులను చేస్తారని తెలిపారు శుక్ర వారం ఉదయం ప్రారంభం అయ్యే సదస్సు కు ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, పాల్గొనగా పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ కీలక ప్రసంగం చేస్తారు సమాచార పౌర సంబంధాల ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్ పాల్గొంటారు ఎల్ నినో ప్రభావాల అంశాలు పై విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీరింగ్ అధికారి పి గోపాల కృష్ణ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు విజయ కుమార్ పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రాజేష్ కుమార్ ప్రసంగిస్తారని తెలిపారు.