BREAKING
వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వైసిపి నేత కారుపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి *పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం* రొంపిచర్లలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి ఉదయాన్నే పచ్చగడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని ఆరోగ్య లాభాలా.. నిపుణులు ఏమంటున్నారంటే పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయం పురాణాల నుంచి ఏఐ ప్రపంచం వరకు.. 'ది ప్రాంప్ట్ వార్' టైటిల్ అనౌన్స్మెంట్ ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు పటిష్ట బందోబస్తు... నాలుగు అంచెలుగా పోలీసు భద్రతా ఏర్పాట్లు నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కోలీవుడ్ స్టార్ హీరోతో బుచ్చిబాబు సానా నెక్స్ట్ ప్రాజెక్ట్.. యాక్షన్ డ్రామాగా భారీ చిత్రం! మున్సిపల్ ఎన్నికలపై ఉద్యోగులకు గుంటూరు కమిషనర్ కీలక ఆదేశాలు ఓటీటీలో సత్తా చాటుతున్న 'వసుదేవసుతం'.. త్వరలోనే ప్రీక్వెల్ అంటూ దర్శకుడు వైకుంఠ బోను ప్రకటన! *ప్రభుత్వం మౌనం వీడి.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు న్యాయం చేయాలి* *ప్రభుత్వం స్పందించకపోతే కారంమెతుకులే దిక్కు!* *– ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్‌* * మంత్రాలయంలో టీడీపీ–వైసీపీ మధ్య రణరంగం! తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ఎప్పుడూ గౌరవిస్తాను – ఆచంట సునీత

ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ. అద్దంకిలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్.

Select Suryaa Now
ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ. అద్దంకిలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్.

సూర్య న్యూస్ అద్దంకి.

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుగుతున్నాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. అద్దంకి ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 27 మండలాల పరిధిలో గల 27 జెడ్పిటిసి స్థానాలకు సంబంధించి జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే ఎంపిటిసి స్థానాలకు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలైన దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు తదితర మండలాల్లో స్వయంగా పర్యటించి పరిశీలించినట్లు కలెక్టర్ చెప్పారు. అక్కడ కూడా నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి విఘాతం లేకుండా, ప్రశాంతంగా సాగుతోందని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేదా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టమైన సూచనలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థులు ప్రశాంతంగా వచ్చి తమ నామినేషన్లు సమర్పించుకోవాలని సూచించారు.