BREAKING
వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వైసిపి నేత కారుపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి *పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం* రొంపిచర్లలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి ఉదయాన్నే పచ్చగడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని ఆరోగ్య లాభాలా.. నిపుణులు ఏమంటున్నారంటే పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయం పురాణాల నుంచి ఏఐ ప్రపంచం వరకు.. 'ది ప్రాంప్ట్ వార్' టైటిల్ అనౌన్స్మెంట్ ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు పటిష్ట బందోబస్తు... నాలుగు అంచెలుగా పోలీసు భద్రతా ఏర్పాట్లు నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కోలీవుడ్ స్టార్ హీరోతో బుచ్చిబాబు సానా నెక్స్ట్ ప్రాజెక్ట్.. యాక్షన్ డ్రామాగా భారీ చిత్రం! మున్సిపల్ ఎన్నికలపై ఉద్యోగులకు గుంటూరు కమిషనర్ కీలక ఆదేశాలు ఓటీటీలో సత్తా చాటుతున్న 'వసుదేవసుతం'.. త్వరలోనే ప్రీక్వెల్ అంటూ దర్శకుడు వైకుంఠ బోను ప్రకటన! *ప్రభుత్వం మౌనం వీడి.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు న్యాయం చేయాలి* *ప్రభుత్వం స్పందించకపోతే కారంమెతుకులే దిక్కు!* *– ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్‌* * మంత్రాలయంలో టీడీపీ–వైసీపీ మధ్య రణరంగం! తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ఎప్పుడూ గౌరవిస్తాను – ఆచంట సునీత

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం- జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్

Select Suryaa Now
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం- జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్

సూర్య, నంద్యాల బ్యూరో:దేశ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో  నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ కమేమరేషన్ డే) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ జి. సూరజ్ ధనుంజయ్, సబ్ కలెక్టర్ మనీషా, అదనపు ఎస్పీ ఖాదర్ బాషా, ఎస్‌డీపీఓ సుస్మిత తదితర పోలీసు అధికారులు పాల్గొని పోలీసు అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్న పోలీసుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటం, నేరాలను అరికట్టడం, ప్రజలకు భద్రత కల్పించడం వంటి బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తుచేసుకున్నారు. పోలీసు సేవలు కేవలం విధి నిర్వహణకే పరిమితం కాకుండా ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, బాధితులకు న్యాయం అందేలా కృషి చేయడం వంటి విస్తృతమైన బాధ్యతలను కలిగి ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల కట్టడి, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం వంటి కీలక అంశాల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు.
ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, వారి సమస్యలను సహనంతో ఆలకించి, ఇరువర్గాల వాదనలను సమగ్రంగా పరిశీలించి న్యాయబద్ధంగా స్పందించడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెంపొందించేలా పారదర్శకత, నిబద్ధత, సేవాభావంతో విధులు నిర్వహించడం ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యత అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల కుటుంబాల త్యాగాలు కూడా వెలకట్టలేనివని, అటువంటి కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా నిలిచి, వారి సంక్షేమానికి భరోసా కల్పించాల్సిన ప్రాధాన్యత ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పోలీసు అమరవీరుల ధైర్యసాహసాలు, అంకితభావం, త్యాగనిరతి భావితరాలకు స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో నిబద్ధతతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. అదనపు ఎస్పీ ఖాదర్ బాషా మాట్లాడుతూ, 1959 అక్టోబర్‌లో లడఖ్‌లో చైనా బలగాల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పది మంది పోలీసు సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసు ఉద్యోగం కేవలం జీవనోపాధి కాదని, అది బాధ్యతతో కూడిన ప్రజాసేవ అని పేర్కొన్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ, పండుగలు, అత్యవసర సమయాల్లోనూ ప్రజల రక్షణ కోసం నిరంతరం విధులు నిర్వర్తించే పోలీసుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. నేరాల నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తూ, చట్టాల అమలులో నిష్పక్షపాతంగా, ప్రజల పట్ల మానవీయ దృక్పథంతో పనిచేయడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు కానుకలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో పోలీసు శాఖకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*