నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టిన యువకుడు, కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ సమీపంలో ఒక యువకుడు బైక్ పై వెళుతున్న ఇరువురు కానిస్టేబుళ్లను ఢీకొట్టాడు. బైక్ పై వెళుతున్న ఇరువురు కానిస్టేబుల్లు డయల్ 100 కాల్స్ అటెండ్ చేసే విధులు నిర్వహిస్తున్న వారిగా తెలిసింది. ఇక కారుతో ఢీ కొట్టిన యువకుడు సైతం పోలీస్ శాఖకు చెందిన కుటుంబ సభ్యుడిగా తెలుస్తుంది. మంగళవారం రాత్రి ఆ యువకుడు ఒకచోట న్యూసెన్స్ చేస్తుండడంతో డయల్ 100కు కొందరు సమాచారం ఇవ్వడంతో విధి నిర్వహణలో భాగంగా ఇరువురు కానిస్టేబుళ్లు బైక్ పై వెళ్లి ఆ యువకుని తీవ్రంగా హెచ్చరించినట్టు తెలిసింది. ఆ కోపంతోనే బుధవారం ఉదయం కారుతో సదరు యువకుడు కానిస్టేబుల్లను డీ కొట్టినట్లు సమాచారం .ఈ ఘటనలో ఇరువురు కానిస్టేబుల్ లకు గాయాలయ్యాయి .ఇరువర్గాలు పోలీస్ శాఖకు చెందిన వారు కావడంతో పోలీసులు ఏం చర్య తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది.
పి విజయ్ కుమార్ , సూర్య ప్రతినిధి నాగర్ కర్నూల్