పరిశ్రమల పరిరక్షణ కోసమే నేడు, రేపు ధర్నా
సూర్య నస్పూర్ : పరిశ్రమల పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, ప్రభుత్వ రంగ సంస్థల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఐటీయూ ఆధ్వర్యంలో అక్టోబర్ 25, 26 హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద రెండు రోజులపాటు ధర్నా నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడులపై తన వైఖరిని స్పష్టం చేయాలని, సింగరేణికి రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లాభాల వాటా ప్రకటన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపడుతున్నట్లు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆర్కే-5 పిట్ కమిటీ నాయకులు తెలిపారు. ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ కమిటీ అసిస్టెంట్ పిట్ సెక్రటరీ కామ్రేడ్ చిగురు లక్ష్మణ్ ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. సింగరేణితోపాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే ఈ ధర్నాలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కామ్రేడ్ నెలబోయిన కుమార్, కామ్రేడ్ పుప్పాల మహేష్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.