BREAKING
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రోజూ తీసుకోవాల్సిన సమతుల్య ఆహారం ఏమిటి? శస్త్రచికిత్స తర్వాత మొదటిసారి బహిరంగంగా స్పందించిన పోప్ లీయో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చియా సీడ్స్, అవిసె గింజల్లో ఏది బెటర్? నిపుణుల సలహాలు! బ్రెజిల్ ఎన్నికల వేళ ఓటర్లను వేధిస్తున్న ప్రధాన సమస్యలు జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి – ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి కర్నూలు 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ టీమిండియా భవిష్యత్ స్టార్ తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన.. యువ బ్యాటర్‌కు కోచ్ గాంబీర్ విలువైన సూచనలు! ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.. 17వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి భవాని రవికుమార్‌ విస్తృత ప్రచారం కర్నూలు 19వ వార్డు బుధవారపేటలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం నా అభిమానులను ఎప్పటికీ గర్వపడేలా చేస్తా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎమోషనల్! జనసేన పార్టీ నుండి వైఎస్సార్‌సీపీలోకి జనసేన ఆలమూరు మండల ఉపాధ్యక్షులు కొనగళ్ల ధనరాజు నాయుడు ఎంపిపి అభ్యర్థి వెంగయ్యకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపినేత బడేనాయబ్ రసూల్:

జనగణనలో బీసీ కులగణనకు ప్రత్యేక కాలమ్ చేర్చాలి బీసీ, ఎస్సీ–ఎస్టీ, రైతు డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి

Select Suryaa Now
జనగణనలో బీసీ కులగణనకు ప్రత్యేక కాలమ్ చేర్చాలి  బీసీ, ఎస్సీ–ఎస్టీ, రైతు డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి

 

సిద్దిపేట అర్బన్, మేజర్ న్యూస్ :

కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న 2027 జనగణనలో బీసీల కులగణనకు ప్రత్యేక కాలమ్‌ను చేర్చాలని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రకటించిన బీసీ, ఎస్సీ–ఎస్టీ, రైతు డిక్లరేషన్ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్), బీఎల్పీ పార్టీల ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు కోటగిరి ఆంజనేయులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్ల సాధన కోసం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అక్టోబర్ 23 నుంచి నవంబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామికవాదులు, సామాజిక న్యాయ ఉద్యమకారులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు, రైతు, కార్మిక, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోటగిరి ఆంజనేయులు, బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దబ్బేట ఆనంద్ మాట్లాడుతూ.. దేశంలో సామాజిక న్యాయం సాధించాలంటే కులాలవారీగా జనాభా లెక్కలు సేకరించడంతో పాటు ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి స్థితిగతులపై సమగ్ర సమాచారాన్ని సేకరించి ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగాలి

బహుజన నాయకులు సత్తయ్య మాట్లాడుతూ.. బీసీలకు సంబంధించిన కచ్చితమైన జనాభా గణాంకాలు అందుబాటులో ఉంటేనే విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపుల్లో జనాభా దామాషా ప్రకారం న్యాయం చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ సిద్దిపేట జిల్లా జేఏసీ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనలో బీసీల కులాలవారీ జనాభా వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక కాలమ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కులగణన ద్వారా వెలుగులోకి వచ్చే సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన విధానాలను రూపొందించాలని కోరారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ, ఎస్సీ–ఎస్టీ, రైతు డిక్లరేషన్ హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించకుండా, వాటి అమలుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని సమావేశంలో నాయకులు డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధనకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

పలువురు సంఘాల నాయకుల పాల్గొనడం

ఈ సమావేశంలో మాస్ ప్రచార కార్యదర్శి బీసీ ప్రభు రాజ్ గంగపుత్ర, కొరివి కృష్ణస్వామి సేవాసమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొత్తం శ్రావణ్ కుమార్, నాయీ బ్రాహ్మణ సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు వేముల కుమార్, ఆర్ఎస్పీ పార్టీ సిద్దిపేట జిల్లా నాయకులు రవికుమార్, బీఎల్టీయూ ట్రేడ్ యూనియన్ చిన్నకోడూరు మండల ఇన్‌చార్జి దానబోయిన రాజు, దళిత బహుజన ఫ్రంట్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు పోతరాజు శంకర్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకురాలు కొమ్మాట పుష్ప, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు నారోజు రత్నయ్య చారి తదితరులు పాల్గొన్నారు.

 సూర్య న్యూస్: సిద్దిపేట అర్బన్, రిపోర్టర్ - దేవులపల్లి భూపతి