నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ చరమంద రాజు రికార్డులు, క్రైమ్ ఫైళ్ల పరిశీలన.. పోలీస్ సిబ్బందికి కీలక సూచనలు
నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ చరమంద రాజు
రికార్డులు, క్రైమ్ ఫైళ్ల పరిశీలన.. పోలీస్ సిబ్బందికి కీలక సూచనలు
నేరేడుచర్ల మేజర్ న్యూస్
వార్షిక తనిఖీల్లో భాగంగా కోదాడ డీఎస్పీ ఆర్. శ్రీనివాస్ రెడ్డి, హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు, నేరేడుచర్ల ఎస్సై సీహెచ్. గోపాల్ రెడ్డితో కలిసి మంగళవారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గత మూడు సంవత్సరాల పోలీస్ స్టేషన్ రికార్డులు, క్రైమ్ ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ సిబ్బంది కిట్ పరికరాలు, స్టేషన్ పరిసరాలను తనిఖీ చేశారు.పోలీసులు విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని డీఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు